జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఈ శిబిరాన్ని సందర్శించి, నిర్వాహకులను అభినందించారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. సంగారెడ్డి సన్రైజ్ హాస్పిటల్, రథసారథి దినపత్రిక సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
సంక్షేమ కార్యక్రమాలు












