భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని ఆళ్లపల్లి గ్రామంలో బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బతుకమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ఇటువంటి కార్యక్రమాల ప్రాధాన్యతను ఆయన వివరించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతిరూపంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతోందని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
తరతరాలుగా కొనసాగుతున్న ఈ గొప్ప సంప్రదాయాన్ని కాపాడుకుంటూ, భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. గ్రామాల్లో నిర్వహించే ఇలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు మన సంప్రదాయాల పట్ల యువతలో అవగాహనను పెంచుతాయని తెలిపారు.












