కామారెడ్డి, జూలై 29
గురుపౌర్ణమి సందర్భంగా కామారెడ్డి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సమాజ సేవలో నిమగ్నమైన పలువురు వ్యక్తులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎండోమెంట్ విభాగం నాయకులు పాల్గొన్నారు.
గురుపౌర్ణమి సందర్భంగా సెంట్రల్ కమిటీ ఎండోమెంట్ ధార్మిక పరిషత్ సూచనల మేరకు కామారెడ్డి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్కాన్‌కు చెందిన అరవింద్ కృష్ణదాస్ ప్రభుజీ తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసిన సేవాభావాన్ని కొనియాడుతూ ప్రసంగించారు.
అలాగే భవానిపేట్–ఆరేపల్లి మధ్య ఉన్న అనాథాశ్రమాన్ని నిర్వహిస్తూ నిరాశ్రయ చిన్నారులకు ఆశ్రయం, విద్య, సంరక్షణ అందిస్తున్న శోభా నాయక్ దంపతులను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. సమాజ సేవలో వారి అంకితభావం ఆదర్శప్రాయమని పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎండోమెంట్ విభాగం కామారెడ్డి జిల్లా కో-కన్వీనర్ పన్యాల నరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు చేగంటి నరేష్, గంగయ్యల బాబా గౌడ్, రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గురుపౌర్ణమి ప్రాముఖ్యతను వివరించి, సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు.











