కడప, 8 September
వై.ఎస్.ఆర్. జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, వినాయక చవితి పండుగ నేపథ్యంలో శాంతిభద్రతలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. జి.ఆర్. పల్లి కోరారు. స్టేషన్ పరిధిలోని వెల్దుర్తి, వెంకటాపురం గ్రామాల్లో గ్రామస్తులతో కృష్ణయ్య. కృష్ణయ్య సమావేశాలు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వై.ఎస్.ఆర్. జిల్లా *➡️ స్థానిక సంస్థల ఎన్నికలు, వినాయక చవితి నేపథ్యంలో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని ఎస్ఐ కృష్ణయ్య నిర్వహించారు* జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు జి.ఆర్. పల్లి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో వెల్దుర్తి, వెంకటాపురం గ్రామాల్లో గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరియు వినాయక చవితి పండుగ నేపథ్యంలో గ్రామస్తులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో ఉండాలని, ఎన్నికల నిబంధనలు మరియు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటం, ఇతరులను రెచ్చగొట్టడం, గొడవలకు దిగడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అదేవిధంగా వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని, పోలీసుల సూచనలు మరియు భద్రతా మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. ఎన్నికలు, పండుగల నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులకు సహకరించాలని, గ్రామంలో శాంతిభద్రతలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్.ఐ. కృష్ణయ్య ఈ సందర్భంగా కోరారు.











