పల్వంచ (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 06
కామారెడ్డి జిల్లా ఉమ్మడి మండల పరిధిలోని ఎల్పుగొండ గ్రామానికి చెందిన ఎ. బాబురావు (104) ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆహార నియమాలు, క్రమశిక్షణ, ప్రశాంతమైన జీవన విధానంతో 104 ఏళ్లు ఆరోగ్యంగా జీవించిన ఆయన మృతి గ్రామ ప్రజలను విషాదంలో ముంచింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
104 ఏళ్ల ఆరోగ్య జీవనం... తుది శ్వాస విడిచిన ఏ బాబురావు ఆహార నియమాలు.. క్రమశిక్షణ.. కోపతాపాలకు దూరంగా జీవనం పాతూరు నుంచి నూతన ఎల్పుగొండ రూపకల్పనలో బాబురావు కీలక పాత్ర గ్రామ అభివృద్ధికి చిరస్మరణీయం కామారెడ్డి జిల్లా, ఎల్పుగొండ: ఆహార నియమాలు, క్రమశిక్షణ, ప్రశాంతమైన జీవన విధానంతో 104 ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించిన ఎ. బాబురావు తుది శ్వాస విడిచారు. కామారెడ్డి జిల్లా ఉమ్మడి మండల పరిధిలోని ఎల్పుగొండ గ్రామానికి చెందిన బాబురావు ఆదివారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో కన్నుమూశారు. 104 ఏళ్ల వయసులోనూ చివరి మూడు, నాలుగు రోజుల వరకు తన పనులను తానే చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్న బాబురావు మృతి గ్రామ ప్రజలను విషాదానికి గురిచేసింది. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు క్రమశిక్షణతో జీవించడం, కోపతాపాలకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించడం ఆయన ఆరోగ్య రహస్యంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆరుగురు కుమారులు.. ఉన్నత స్థాయిలో స్థిరపడిన కుటుంబం బాబురావుకు ఆరుగురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు దోమకొండ దేవేందర్‌రావు వైద్యుడిగా సేవలందిస్తుండగా, రెండో కుమారుడు సంజీవరావు రిటైర్డ్ ఇంజనీర్‌గా ఉన్నారు. మిగతా నలుగురు కుమారులు వ్యవసాయం, ఇతర వ్యాపార రంగాల్లో స్థిరపడ్డారు. నూతన ఎల్పుగొండ రూపకల్పనలో కీలక పాత్ర బాబురావు కేవలం కుటుంబానికే పెద్దగా కాకుండా గ్రామ అభివృద్ధిలోనూ తనదైన ముద్ర వేశారు. సుమారు 50 ఏళ్ల క్రితం ఎల్పుగొండ గ్రామం పాతూరుగా ఉండేది. వాగుల కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆ సమయంలోనే భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామ పెద్దలతో చర్చించి నూతన ఎల్పుగొండ గ్రామాన్ని ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయడంలో బాబురావు ఎంతో సహకరించినట్లు గ్రామస్తులు గుర్తుచేసుకుంటున్నారు. గ్రామం ఒక క్రమపద్ధతిలో రూపుదిద్దుకోవడానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొంటున్నారు. గ్రామ ప్రజల ప్రగాఢ సానుభూతి మంచితనం తొ నేటి రోజుల్లో వందేళ్లకు పైగా జీవించడం అరుదైన విషయమైతే.. 104 ఏళ్ల వయసు వరకు ఆరోగ్యంగా, క్రమశిక్షణతో జీవించడం విశేషమని గ్రామస్తులు అంటున్నారు. బాబురావు మృతి పట్ల కుటుంబ సభ్యులకు, బంధువులకు, గ్రామ ప్రజలకు పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు.











