అన్నమయ్య జిల్లా, బి. మండలం నాయుని భావి వద్ద యువ రైతు గంగిరెడ్డి గారి గోపాల్ రెడ్డి (40) దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం తన బోరు బావి వద్ద ఒంటరిగా ఉన్న అతడిపై ప్రత్యర్థులు దాడి చేశారు.
ప్రత్యర్థులు గోపాల్ రెడ్డి కాళ్లు చేతులు కట్టేసి, పొదల చాటుకు లాక్కెళ్లి ఇనపరాడ్లు, బండరాళ్లతో విచక్షణారహితంగా కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ హత్య ఆదివారం జరిగినట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఘటన జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.












