కామారెడ్డిలో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసులు సత్వరమే స్పందించి, నిందితులను అరెస్టు చేశారు. ఆదిత్య అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రత్యేక బృందాల సహాయంతో బాలుడిని క్షేమంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆదిత్య తన నాలుగేళ్ల కుమారుడు ధనుష్ కిడ్నాప్ అయ్యాడని కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఉప్పల్వాయి, రామేశ్వర్‌పల్లి గ్రామాలకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసి, బాలుడి ఆచూకీని గుర్తించారు. అనంతరం బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కేసు దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యక్ష సమాచారం కీలకంగా ఉపయోగపడ్డాయని సీఐ బి. నరహరి తెలిపారు. ప్రజలు తమ గ్రామాల్లో, వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.












