బెంగళూరులోని యలహంకలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కుమార్తెతో ఉన్న 22 ఏళ్ల ఉద్యోగి కిరణ్‌పై వ్యాపారవేత్త ఆనంద్‌రాజ్ దాడి చేయడంతో అతను మృతి చెందాడు. పోలీసులు వ్యాపారవేత్తను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడు కేరళలోని పాలక్కాడ్‌కు చెందినవాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, 45 ఏళ్ల వ్యాపారవేత్త ఆనంద్‌రాజ్‌ను అరెస్టు చేశారు. హత్య ముందస్తు ప్రణాళికతో జరిగిందా ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











