హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత జాషువా వాంగ్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై జాతీయ భద్రతా చట్టం కింద ఈ తీర్పు వెలువడింది. 2020లో హాంకాంగ్, చైనా ప్రభుత్వాలపై ఆంక్షలు విధించేలా ప్రయత్నించారన్నది ఆయనపై ప్రధాన ఆరోపణ.
హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ కార్యకర్త జాషువా వాంగ్‌కు అక్కడి న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై జాతీయ భద్రతా చట్టం కింద ఈ తీర్పు వెలువడింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
2020లో హాంకాంగ్, చైనా ప్రభుత్వాలపై విదేశీ దేశాలు ఆంక్షలు విధించేలా ప్రయత్నించారన్నది ఆయనపై ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో ప్రవాస కార్యకర్త నాథన్ లాతో కలిసి పనిచేశారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఈ ఆరోపణలకు సంబంధించి జాషువా వాంగ్ గత సెప్టెంబర్‌లో నేరాన్ని అంగీకరించారు.












