కమలాపురం (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 10
వైఎస్సార్ జిల్లా మండలం చదిపిరాళ్ల ఎస్సీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. పక్కింటిలో నివాసముంటున్న మేరి అనే మహిళపై పొరుగింటి వ్యక్తి (అలియాస్ కన్నా) చేపడుతున్నారు.తో దర్యాప్తుంగా గాయపరిచాడు. దర్యాప్తుంగా గాయపడిన మహిళను బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి పరిస్థితి విషమంగా ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చదిపిరాళ్లలో మహిళపై పొరుగింటి వ్యక్తి కత్తితో దాడి: తీవ్రంగా గాయపడిన మహిళను హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన బంధువులు... విషమ పరిస్థితిలో గాయపడ్డ మహిళా... పోలీసుల అదుపులో నిందితుడు... డిస్ట్రిక్ట్ బ్యూరో ఇంచార్జ్ కడప డాక్షిన్ టైమ్స్ . వైఎస్సార్ కడప జిల్లా మండలం చదిపిరాళ్ల ఎస్సీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. పక్కింటిలో నివాసముంటున్న మేరి అనే మహిళపై ఆమె పొరుగింటి వ్యక్తి జయరాజ్ (అలియాస్ కన్నా) కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరిద్దరి మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదమే ఈ కత్తి దాడికి దారితీసింది. ఆవేశానికి గురైన జయరాజ్ కత్తితో ఒక్కసారిగా దాడి చేయడంతో మేరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న దాడికి పాల్పడిన జయరాజ్ మతిస్థిమితం సరిగా లేదని సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు జయరాజ్‌ను అదుపులోకి తీసుకుని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.












