మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాకేశ్ అగర్వాల్ హత్య కేసులో కీలక పురోగతి లభించింది. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కేర్‌టేకర్ వరుణ్ కుమార్‌ను దాదాపు నెల రోజుల గాలింపు అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో పోలీసులు అరెస్ట్ చేశారు. భోపాల్‌కు తరలిస్తుండగా తప్పించుకునే యత్నంలో అతడి కాలికి గాయమైంది.
1982 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాకేశ్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఆయన కేర్‌టేకర్ వరుణ్ కుమార్‌ను దాదాపు నెల రోజుల గాలింపు అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసుల వివరాల ప్రకారం, భోపాల్‌లోని సూరజ్ నగర్ ప్రాంతంలోని తన నివాసంలో రాకేశ్ అగర్వాల్ గొంతు కోసిన స్థితిలో మృతి చెంది కనిపించారు. ఘటన జరిగిన మూడు రోజుల ముందే వరుణ్ కుమార్‌ను ఓ ఏజెన్సీ ద్వారా 24 గంటల కేర్‌టేకర్-కమ్-మేల్ నర్స్‌గా నియమించారు. హత్య అనంతరం అతడు కనిపించకుండా పోవడంతో పోలీసులు అతడిపై అనుమానం వ్యక్తం చేశారు.












