తాడ్వాయి, 13 September
కామారెడ్డి జిల్లా మండలం పీరమాయికుంట తండా శివారులోని దుర్గామాత, సేవాలాల్ ఆలయాల్లో జరిగిన చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, సుమారు రూ.75 వేల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆలయ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ కామారెడ్డి జిల్లా మండలం పీరమాయికుంట తండా శివారులోని దుర్గామాత, సేవాలాల్ ఆలయాల్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి సుమారు రూ.75 వేల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 9న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయాల తాళాలు పగులగొట్టి అర తులం బంగారు ముక్కుపుడక, ఒక తులం వెండి ముక్కుపుడక, అర తులం బంగారు పుస్తెల జత, 30 తులాల వెండి గొలుసును చోరీ చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎల్లారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో సదాశివనగర్ సీఐ వీరయ్య, ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారాన్ని సేకరించి దర్యాప్తు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పీరమాయికుంట/పల్లెగడ్డ తండాకు చెందిన జాదవ్ ప్రేమదాస్ (26)ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి సమాచారం మేరకు చోరీ చేసిన ఆభరణాలతో పాటు నేరానికి ఉపయోగించిన సుమారు 20 అంగుళాల ఇనుప రాడ్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. కేసును ఛేదించిన సీఐ వీరయ్య, ఎస్సై నరేష్‌తో పాటు సిబ్బంది సాయిబాబా, సురేష్, యాదగిరిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు పోలీసులు తెలిపారు.











