వై.ఎస్.ఆర్ కడప, 11 September
రాజంపేటలో గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా, పోలిచెరువు గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రాంతాన్ని సబ్ కలెక్టర్ హెచ్.ఎస్ భావన ఐ.ఎ.ఎస్ శుక్రవారం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, తొక్కిసలాటలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలిచెరువు గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ భావన కడప డాక్షిన్ టైమ్స్ బ్యూరో ఇంచార్జ్ . రాజంపేట: గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్ భావన ఐ.ఎ.ఎస్, మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలిచెరువు గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రాంతాన్ని శుక్రవారం పరిశీలించారు. మన్నూరు సి.ఐ. లింగప్ప మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులతో కలసి ఆమె ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, తొక్కిసలాటలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లతో పాటు ఘాట్ వద్ద అవసరమైన వెలుతురు, క్రేన్లు, ఈతగాళ్ల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలపై సమగ్రంగా సమీక్షించారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో, వైభవంగా ముగిసేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సబ్ కలెక్టర్ సూచించారు.










