నంద్యాల, జూన్ 30
నంద్యాల జిల్లా, పాణ్యం నియోజకవర్గం గడివేముల గ్రామానికి చెందిన చిక్కోండు శ్రావణి జర్మనీలో ఉద్యోగం కోసం వెళ్తున్నారు. మంగళవారం ఆమె తల్లిదండ్రులతో కలిసి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని నంద్యాలలోని కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. బి.ఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన శ్రావణికి ఎంపీ అభినందనలు తెలిపారు.
నంద్యాల జిల్లా, పాణ్యం నియోజకవర్గం గడివేముల గ్రామానికి చెందిన చిక్కోండు శ్రావణి జర్మనీ దేశంలో ఉద్యోగం కోసం వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం నంద్యాల బొమ్మలసత్రంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రావణితో పాటు ఆమె తల్లిదండ్రులు చిట్టెమ్మ, నరసంహులు కూడా ఎంపీని కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు.
బి.ఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన శ్రావణి, జర్మనీలో ఉద్యోగం కోసం వెళ్తున్నట్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి వివరించారు. దీనికి స్పందించిన ఎంపీ, శ్రావణికి కంగ్రాట్స్ చెప్పి, జర్మనీలో ఉద్యోగం చేస్తున్న తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు.












