జపాన్‌లో టీచర్ ఎక్స్పోజర్ విజిట్2026లో పాల్గొని తిరిగి వచ్చిన జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు బుధవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి, అక్కడి విద్యా విధానం, బోధనా పద్ధతులు, పాఠశాలల నిర్వహణ తీరును వివరించారు. విద్యార్థి కేంద్రీకృత బోధన, క్రమశిక్షణ, నైతిక విలువలు వంటి అంశాలు తమను ఆకట్టుకున్నాయని తెలిపారు.
జిల్లా చిన్నమల్లారెడ్డి ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు పిల్లమారి ప్రవీణ్ కుమార్, కొండాపూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు ఇందిర, జపాన్‌లో నిర్వహించిన టీచర్ ఎక్స్పోజర్ విజిట్2026లో పాల్గొని తిరిగి వచ్చిన అనంతరం బుధవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి, జపాన్‌లో ప్రత్యక్షంగా పరిశీలించిన విద్యా విధానం, బోధనా పద్ధతులు, పాఠశాలల నిర్వహణ తీరును వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా, జపాన్‌లోని పాఠశాలలను సందర్శించి పరిశీలించిన విద్యార్థి కేంద్రీకృత బోధన, క్రమశిక్షణ, నైతిక విలువలు, సమయపాలన, పరిశుభ్రత, స్వయం బాధ్యత, సహకార భావన, ప్రయోగాత్మక విద్య తదితర అంశాలను వారు కలెక్టర్‌కు వివరించారు.












