ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్-ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ () కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం - 2026 నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, జ్ఞానాన్ని నింపి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేది గురువులేనని పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రైవేట్ విద్యా రంగంలో నిరంతరం శ్రమిస్తూ, పరిమిత వసతుల్లో కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.










