జిల్లా సదాశివనగర్ మండలం ధర్మరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సుతో పాటు స్లొగన్ రైటింగ్ పోటీలు నిర్వహించారు.
పాఠశాల స్టాండర్డ్ క్లబ్ మెంటర్ కృష్ణాకర్ రావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, దైనందిన జీవితంలో నాణ్యతా ప్రమాణాల ప్రాముఖ్యతను వివరించారు. వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఉత్పత్తులనే ఎంచుకోవాలని సూచించారు. మార్కెట్లో లభించే వస్తువులపై ఐఎస్ఐ () మార్క్ ప్రాధాన్యతను, స్వర్ణాభరణాల కొనుగోలులో మోసపోకుండా హాల్‌మార్క్ గుర్తును పరిశీలించాల్సిన ఆవశ్యకతను ఆయన తెలియజేశారు. ఉత్పత్తుల నాణ్యత, లైసెన్స్ వివరాలను స్వయంగా ధృవీకరించుకోవడానికి భారతీయ ప్రమాణాల బ్యూరో రూపొందించిన బిఐఎస్ కేర్ యాప్ ఉపయోగం గురించి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్లొగన్ రైటింగ్ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నాణ్యత మరియు భద్రతలపై ఆకర్షణీయమైన నినాదాలను రాశారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు దయానంద్, రాజు గౌడ్, సుకుణ, అన్వర్ మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












