జర్నలిస్టులు నైతిక విలువలను కాపాడుకుంటూ వాస్తవాలను నిర్భయంగా వెలుగులోకి , ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ఏఐ, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని ధ్రువీకరించిన తర్వాతే వార్తలుగా ప్రచురించాలని సూచించారు.
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని వివిధ నియోజకవర్గాలు, మండలాల జర్నలిస్టులకు బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తారని అన్నారు. జిల్లాలో సుమారు 500 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. శిక్షణ ద్వారా క్రైమ్, సివిల్, రెవెన్యూ తదితర అంశాలపై జర్నలిస్టులకు నైపుణ్యం పెరుగుతుందన్నారు.












