జర్నలిజంలో వస్తున్న మార్పులను స్వీకరించి, వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని పూతలపట్టు శాసనసభ్యులు కె. మురళీ మోహన్ గ్రామీణ విలేఖరులకు సూచించారు. తిరుపతి జిల్లాలో సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల పునశ్చరణ తరగతుల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీ మోహన్ తాను జర్నలిస్టుగా పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ తో తనకున్న అనుబంధాన్ని తెలిపారు. గ్రామీణ జర్నలిస్టుల నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆలపాటి సురేశ్ కుమార్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. అనంతరం విలేఖరులకు సర్టిఫికెట్లు, పుస్తకాలను అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజా ప్రయోజనమే వార్తకు గీటురాయి










