నగరంలోని బుడ్డాయిపల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల బాలుర వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం, తాగునీరు, వసతి నిర్వహణపై అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. విద్యార్థుల కోసం తెచ్చిన చికెన్‌లో 3 కిలోలు పక్కకు తీయాలని తెలుగు ఉపాధ్యాయుడు ఆదేశించినట్లు వంట సిబ్బంది వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎపి ఎరుకుల డెవలప్మెంట్ అసోసియేషన్, గిరిజన అభివృద్ధి సంఘాలు సమగ్ర విచారణకు డిమాండ్ చేశాయి.
నగరంలోని బుడ్డాయిపల్లిలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల బాలుర వసతి గృహంలో విద్యార్థుల భోజనం, తాగునీరు, వసతి నిర్వహణపై తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆదివారం ఎపి ఎరుకుల డెవలప్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పూజారి. రెడ్డిశేఖర్, కార్యవర్గ సభ్యులు, గిరిజన అభివృద్ధి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేద్రి.సుధాకర్ వసతి గృహాన్ని సందర్శించారు. ఈ వసతి గృహంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 110 మంది విద్యార్థులు నివాసం ఉంటున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చికెన్ అవకతవకలపై ఆరోపణలు










