కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంపై టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లకు వేతనాలు చెల్లించకపోవడంపై టీపీటీఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల లింగం ఆందోళన వ్యక్తం చేశారు. స్కావెంజర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంలో స్కావెంజర్లు ప్రతిరోజూ కీలకంగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారికి నెలల తరబడి జీతాలు అందక వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ఇకపై ప్రతి నెలా సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్కావెంజర్ల సమస్యపై జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించి వారికి న్యాయం చేయాలని టీపీటీఎఫ్ కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున అధ్యక్షులు చింతల లింగం, ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ రెడ్డి కోరారు.












