నంద్యాల, జూన్ 30
చదువు పేరుతో పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్, షూస్ వంటి వాటితో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేల, లక్షల రూపాయలు వసూలు చేస్తూ వ్యాపారం చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై ఎమ్ఈఓ ఆఫీస్ ఎదుట వారు ధర్నా నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
చదువు పేరుతో పాఠశాలల ఆవరణంలోనే పుస్తకాలు, యూనిఫామ్, షూస్ వంటి వాటితో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేల, లక్షల రూపాయలు వసూలు చేస్తూ వ్యాపారం చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎమ్ఈఓ ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.












