జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రముఖ జర్నలిస్ట్, టీవీ యాంకర్ నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకున్నారు. శుక్రవారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహంపై శనివారం సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ కావడంతో వెలుగులోకి వచ్చింది.
ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్ () ఖాతాలో నిధి రజ్దాన్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ, నిన్న ఒక కొత్త ప్రయాణం ప్రారంభమైంది అని రాసుకొచ్చారు. నిధి రజ్దాన్ కూడా అదే ఫొటోలను పంచుకుంటూ, అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోల్లో ఇద్దరూ సంప్రదాయ వివాహ దుస్తుల్లో కనిపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వివాహ వివరాలు
ఈ వివాహం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద జరిగినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. శ్రీనగర్, న్యూఢిల్లీలో వివాహ వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించారు. ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు, బంధువులు పాల్గొన్నారు.












