టాలీవుడ్ యువ నటి శ్రీలీలకు మరో భారీ సినిమా అవకాశం దక్కింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ధర్మన్ చిత్రంలో ఆమె భాగమయ్యారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అధికారికంగా ప్రకటించింది.
కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీలకు స్వాగతం పలుకుతూ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. దర్శకుడు అశ్వత్ మారిముత్తు కూడా ఆమెను చిత్ర బృందంలోకి ఆహ్వానించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సినిమాలో రజనీకాంత్ ఓ వైద్యుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. నేరస్థులపై పోరాటం చేసే పాత్రలో ఆయన కనిపించనున్నట్లు చిత్ర బృందం గతంలో వెల్లడించింది. ఇప్పటికే సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.












