కడప నగరంలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ కవర్లలో అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ప్లాస్టిక్ కవర్లలోని హానికర రసాయనాలు ఆహారంలో కలిసి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతున్నాయని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.
మన రోజువారీ ఆహార పదార్థాల కవర్లలో ప్రాణాలను హరించే కాలకూట విషం దాగి ఉంది. పట్టణంలోని హోటళ్లు, టీ అంగళ్లు, రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లలో వేడివేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో కట్టి ఇస్తుంటే, వినియోగదారులు ఏమాత్రం ఆలోచించకుండా వాటిని తిని రోగాల బారిన పడుతున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సాధారణంగా వేడివేడి ఇడ్లీలు, పూరీలు, సాంబార్, చట్నీ లేదా టీ వంటి వాటిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేదా రీసైకిల్డ్ కవర్లలో వేసినప్పుడు, తీవ్రమైన వేడికి ప్లాస్టిక్‌లో ఉండే హానికర రసాయనాలు (, ) కరిగి ఆహారంలో కలుస్తాయి. ఈ పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్, కాలేయ సమస్యలు, థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత వంటి ప్రమాదకర వ్యాధులు చుట్టుముడతాయని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.











