కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో డాక్టర్ బాలుకు అభినందన సన్మాన కార్యక్రమం జరిగింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీ రాందాస్ అగర్వాల్ జన్ సేవా సమ్మాన్ పురస్కారం - 2026 ను డాక్టర్ బాలు అందుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలును ఘనంగా సత్కరించారు. 19 సంవత్సరాలుగా నిర్విరామంగా రక్తదాన సేవలు అందిస్తూ, కామారెడ్డి ఖ్యాతిని ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లిన డాక్టర్ బాలు సేవలు అభినందనీయమని, ఆయన నేటి యువతకు మార్గదర్శకంగా, ప్రేరణగా నిలుస్తారని ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతి లు కొనియాడారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రక్తదానం ప్రాణదానం












