భూమికి ప్రమాదం కలిగించే గ్రహశకలాలను దారి మళ్లించే సాంకేతికతపై పరిశోధనలు ముమ్మరమయ్యాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ () చేపట్టిన హెరా అంతరిక్ష మిషన్, నాసా 2022లో ఢీకొట్టిన డైమోర్ఫోస్ గ్రహశకలాన్ని మరింత దగ్గరగా పరిశీలించేందుకు సిద్ధమైంది. ఈ పరిశోధనలు భవిష్యత్తులో భూమిని రక్షించేందుకు కీలక సమాచారాన్ని అందించనున్నాయి.
హెరా అంతరిక్ష నౌక ఇటీవల డిడిమోస్, డైమోర్ఫోస్ అనే రెండు గ్రహశకలాలను వేర్వేరుగా గుర్తించి, వాటి చిత్రాలను సుమారు 1,280 కిలోమీటర్ల దూరం నుంచి తన కెమెరా ద్వారా బంధించింది. ఈ రెండు గ్రహశకలాలు భూమికి సుమారు 19.7 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
2026లో నాసా చేపట్టిన డార్ట్ () ప్రయోగంలో భాగంగా, డైమోర్ఫోస్ గ్రహశకలాన్ని గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టించారు. ఈ ప్రభావంతో ఆ గ్రహశకలం డిడిమోస్ చుట్టూ తిరిగే సమయం సుమారు 33 నిమిషాలు తగ్గింది. అంతరిక్షంలోని గ్రహశకలం కదలికను మానవులు ఉద్దేశపూర్వకంగా మార్చగలరని ఈ ప్రయోగం నిరూపించింది.












