నైజీరియాలోని వాయవ్య జంఫారా రాష్ట్రంలో పోలీసు కాన్వాయ్‌పై సాయుధ దుండగులు మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది భద్రతా సిబ్బంది మరణించినట్లు స్థానిక స్వచ్ఛంద భద్రతా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో వరుసగా జరుగుతున్న దాడులు, కిడ్నాప్లతో భద్రతా పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
నైజీరియాలో మరోసారి సాయుధ దుండగులు రెచ్చిపోయారు. వాయవ్య నైజీరియాలోని జంఫారా రాష్ట్రంలో పోలీసు కాన్వాయ్‌పై దాడి చేసి కనీసం ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని హతమార్చారు. మంగళవారం ఈ దాడి జరిగినట్లు స్థానిక భద్రతా వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వివరాల ప్రకారం.. పోలీసు వాహనాల కాన్వాయ్ ప్రయాణిస్తున్న సమయంలో సాయుధ దుండగులు ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ దాడిలో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది మరణించినట్లు స్థానిక స్వచ్ఛంద భద్రతా సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే, దాడి జరిగిన ఖచ్చితమైన ప్రాంతం, మృతుల పూర్తి వివరాలు, దుండగుల సంఖ్యపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.












