మంగళవారం ఉదయం యూరప్‌లోని నాలుగు వేర్వేరు విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలాండ్, స్పెయిన్, బల్గేరియా దేశాల్లోని విమానాశ్రయాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. నాలుగు విమానాలూ సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
లండన్ హీత్రో విమానాశ్రయం నుంచి పోలాండ్ రాజధాని వార్సాకు బయలుదేరిన పోలిష్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దానిని వార్సా-మోడ్లిన్ విమానాశ్రయానికి మళ్లించారు. బోయింగ్ 737 విమానంలో 181 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సురక్షితంగా దిగిన తర్వాత ప్రయాణికులను దింపి, భద్రతా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఈ విమానానికి సంబంధించిన బాంబు హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇదే సమయంలో డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగన్ నుంచి వార్సాకు వస్తున్న విమానానికి కూడా బెదిరింపు వచ్చింది. విమానం సాధారణంగానే వార్సాలో ల్యాండ్ అయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది. ఈ ఘటనపై పోలాండ్ పోలీసులు విచారణ చేపట్టారు.












