ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. దేశంలో ఎవరు దేశద్రోహులు, ఎవరికి విదేశీ శక్తులతో సంబంధాలున్నాయి, ఆ సంబంధాల స్వరూపం ఏమిటి అనే అంశాలపై ఏ వేదికపైనైనా ముఖాముఖి చర్చకు సిద్ధమని ప్రకటించారు. మోదీ తనకు నచ్చిన వేదికను ఎంచుకోవచ్చని, చర్చకు న్యాయనిర్ణేతగా ఎవరినైనా నియమించుకోవచ్చని చెప్పారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్‌ను కూడా న్యాయనిర్ణేతగా పెట్టుకోవచ్చని సూచించారు.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అసలు వివాదం ఎక్కడ మొదలైంది
గుజరాత్‌లోని ఏక్తానగర్లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల బాధ్యత ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడమేనని, అయితే ప్రస్తుత ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా దేశాభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు. దేశంలో అస్థిరత సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, విదేశాల్లో ఎవరెవరిని కలుస్తున్నారు భారత వ్యతిరేక శక్తులు ఎవరికి మద్దతు ఇస్తున్నాయి అనే విషయాలను గుర్తించాలని పిలుపునిచ్చారు.