పుదుక్కోట్టై
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సోమవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోకు ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లాలో మొత్తం రూ.68.31 కోట్ల విలువైన 44 పూర్తయిన అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మరో 70 కొత్త పనులకు రూ.11.72 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. పట్టణంలో రూ.23.25 కోట్లతో నిర్మించిన నూతన ఆధునిక బస్ టెర్మినల్‌ను విజయ్ ప్రారంభించారు. ఇందులో 60 బస్సుల బేలు, వాణిజ్య సముదాయాలు, ప్రయాణికుల నిరీక్షణ గదులు, బాలింతల కోసం ప్రత్యేక గది, దివ్యాంగుల కోసం ర్యాంపులు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.












