మెరుగైన ఉపాధి కోసం రష్యా వెళ్లి, ఆ దేశ సైన్యంలో చేరిన గుజరాత్‌కు చెందిన 39 ఏళ్ల రమ్నిక్ సఖ్వాలా నాలుగు నెలలుగా అదృశ్యమయ్యారు. ఆయన ఆచూకీపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం సహాయం చేయాలని భార్య విజ్ఞప్తి చేస్తున్నారు.
సూరత్‌లోని వజ్రాల పరిశ్రమలో మందగమనం కారణంగా రమ్నిక్ 2025లో ఉద్యోగం కోసం రష్యా వెళ్లారు. అక్కడ తొలుత మూడు నెలల బిజినెస్ వీసాపై వెళ్లిన ఆయనకు ఆ తర్వాత మరో ఏడాది పొడిగింపు లభించింది. 2025 ప్రారంభంలో రష్యా సైన్యంలో చేరినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
యుద్ధంలో పాల్గొనడం లేదని హామీ
తాను యుద్ధంలో పాల్గొనాల్సిన అవసరం లేదని, యుద్ధ ప్రాంతంలో సైనికులకు ఆహార సరఫరా చేసే బాధ్యత మాత్రమే ఉంటుందని చెప్పినట్లు ఆయన సోదరుడు మహేశ్ వెల్లడించారు.












