అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటానని వీడియో కాల్ చేసిన వ్యక్తిని తిరుపతి పోలీసులు సకాలంలో కాపాడారు. తెలంగాణలోని జిల్లాకు చెందిన చిన్న రాథోడ్ సంతోష్ అనే వ్యక్తిని పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి, ప్రాణాపాయం నుంచి తప్పించారు.
ఆత్మహత్య చేసుకుంటానని వీడియో కాల్ చేసిన వ్యక్తిని తిరుపతి పోలీసులు సకాలంలో కాపాడారు. వేగంగా స్పందించి, సాంకేతిక సహాయంతో అతని ఆచూకీని గుర్తించి ప్రాణాపాయం నుంచి తప్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణలోని జిల్లాకు చెందిన సావిత్రి అనే మహిళ తిరుపతి పోలీస్ వాట్సాప్ నంబర్ 8099999977కు సమాచారం అందించారు. తన భర్త చిన్న రాథోడ్ సంతోష్ గత మూడు రోజులుగా ఇంటి నుంచి వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని, అదే రోజు వీడియో కాల్ చేసి, అప్పులు ఎక్కువగా ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, తిరుపతిలో ఉన్నానని, చనిపోతానని చెప్పాడని, కాపాడాలని వేడుకుంది.












