మండలం సిద్ధవరం గ్రామానికి చెందిన బరిగల సుబ్బమ్మకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) కింద మంజూరైన రూ.65,795 విలువైన ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా వరలక్ష్మి ఈ చెక్కును ఆమె నివాసం వద్ద అందజేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బమ్మ, తన వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును పరిశీలించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చొరవతో ఈ చెక్కు మంజూరైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రభుత్వ సంక్షేమ పథకాలు












