తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కామారెడ్డి అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కామారెడ్డి పట్టణంలోని సి.ఎస్. చర్చి ఎదుట ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజా నాయకుడిగా ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని తెలిపారు.











