ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరుబాటను విజయవంతం చేయాలని, ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల సంఘం తీరుపై వ్యక్తం చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఓట్ల చోరీ వ్యవహారంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.
నేడు 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఉదయం 10:30 గంటలకు టీపీసీసీ ఆదేశాల మేరకు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పోరుబాట నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఓట్ల చోరీ వ్యవహారంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవస్థ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ, ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఈసీ శ్రీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేస్తామని వెల్లడించారు.











