ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేసినా లేదా అవినీతికి పాల్పడినా ప్రజలు నిర్భయంగా అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) ఫిర్యాదు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సూచించారు. అవినీతి నిరోధక శాఖ సేవలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రచార పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేసినా లేదా అవినీతికి పాల్పడినా ప్రజలు నిర్భయంగా అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) ఫిర్యాదు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సూచించారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రచార పోస్టర్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలు పొందే సమయంలో ప్రజలు లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు ఎదురైతే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064తో పాటు, వాట్సాప్ నంబర్ 94404 40057 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చనే విషయంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు.












