రానున్న స్థానిక సంస్థల ఎన్నికల , చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు లాడ్జిలు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు, అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టడం ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశ్యం.
చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జిలను ఇన్స్పెక్టర్ మొహమ్మద్ హషం తనిఖీ చేశారు. అక్కడ బస చేస్తున్న వ్యక్తుల వివరాలు, గుర్తింపు పత్రాలు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. లాడ్జి నిర్వాహకులు ప్రతి ఒక్కరి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల హామీ












