అన్నమయ్య జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది, పోలీసు బలగాలు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి.
అన్నమయ్య జిల్లాలో రేపు జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంది. మండలాల వారీగా ఎన్నికల విధుల్లో పాల్గొనే భద్రతా సిబ్బందికి అధికారులు ముందస్తు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విధివిధానాలు, భద్రతా నియమాలు, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే అంశాలపై స్పష్టమైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు.











