ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా 582 జెడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 7వ తేదీన చేపట్టనున్నారు.
ఈ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 31,472 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సామగ్రి, సిబ్బందిని ఇప్పటికే కేంద్రాలకు తరలించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు అవసరమైన కనీస వసతులు కల్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 1,841 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా, 2,645 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.












