హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఛాంబర్ ఎదుట బైఠాయించారు.
ఏళ్లుగా తమకు రావాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆందోళనకారులు ఆరోపించారు. బిల్లుల కోసం పలుమార్లు అధికారులను, సంబంధిత శాఖలను సంప్రదించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వారు పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి తమ సమస్యలను నేరుగా వివరించేందుకు పలుమార్లు ప్రయత్నించినా అపాయింట్మెంట్ లభించలేదని రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తా నివేదికలు పేర్కొన్నాయి. తమకు భట్టితో సమావేశం ఏర్పాటు చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ వారు ఛాంబర్ వద్దే కూర్చున్నారు.











