జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాలలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో రక్తదాన శిబిరం, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో రక్తాన్ని అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని లయన్ డా. చంద్రమోహన్ గౌడ్ ఉదారి అన్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320-జీ రెండో ఉప జిల్లా గవర్నర్ లయన్ డా. చంద్రమోహన్ గౌడ్ ఉదారి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. యువతకు స్ఫూర్తిగా నిలిచేందుకు ఆయన తొలుత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా డా. చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ, రక్తదానం గొప్ప సామాజిక సేవ అని తెలిపారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ఇతర అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో రక్తం అందిస్తే విలువైన ప్రాణాలను కాపాడవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యంగా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆయన కోరారు.











