భారత్‌లో ఉద్యోగుల పని సంస్కృతి, పండుగ సెలవులపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీపావళి సందర్భంగా కనీసం వారం రోజుల సెలవులు ఇవ్వాలని ఓ వ్యక్తి వేదికగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. సొంతూళ్లకు వెళ్లేవారి ప్రయాణ కష్టాలు, పని-జీవిత సమతుల్యతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు పండుగకు సొంతూళ్లకు వెళ్లాలంటే వందల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని ఆ వ్యక్తి పేర్కొన్నారు. రైళ్లలో ప్రయాణానికి 30 నుంచి 40 గంటలు పట్టే పరిస్థితుల్లో కేవలం రెండు రోజుల సెలవులతో కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవడం కష్టమని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
యూరప్, అమెరికాలో క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు అనేక సంస్థలు సెలవులు ఇస్తున్నట్లుగా, భారత్‌లోనూ దీపావళికి వారం రోజుల సెలవుల సంస్కృతి రావాలని సూచించారు. విమాన టికెట్ల ధరలు అధికంగా ఉండటం, ఉద్యోగుల వేతనాలకు అవి భారంగా మారడం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు.











