బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు కీలక అడుగులు వేశారు, కొత్త పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని కోరుతూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయానికి లేఖ పంపారు.
2024లో విద్యార్థుల ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం ఆమె భారత్‌కు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. తాజాగా డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని, అక్కడి న్యాయస్థానం ముందు లొంగిపోవాలని ఆమె గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రయాణ, గుర్తింపు పత్రాల కోసం ప్రయత్నించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బంగ్లాదేశ్ ప్రభుత్వం వైఖరి
హసీనాకు కొత్త పాస్‌పోర్ట్ జారీ చేయడం కంటే, భారత్ నుంచి ఆమెను అప్పగించాలన్నదే తమ అభిప్రాయమని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఇరు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం ఆమెను స్వదేశానికి తీసుకురావాలని కోరుతోంది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.











