కట్నీ
దీపావళి పండుగ వేళ మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని సియోనీ, జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు అగ్నిప్రమాదాల్లో రెండు కుటుంబాలకు చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సియోనీ జిల్లాలోని ఛపారా పట్టణం మహావీర్ వార్డులో బంగారు ఆభరణాల వ్యాపారి కుందన్లాల్ సోనీ ఇంట్లో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. మూడు అంతస్తుల భవనంలో మొత్తం పది మంది ఉండగా, ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురిని పోలీసులు, స్థానికులు రక్షించారు. మృతుల్లో 75 ఏళ్ల కుందన్లాల్ సోనీ, ఆయన భార్య రాజ్‌కుమారి సోనీ, ఇతర కుటుంబ సభ్యులు, 16 ఏళ్ల బాలుడు ఉన్నారు.











