దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి సందర్భంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి ఇచ్చినా ఆశించిన ఫలితం కనిపించలేదు. సాధారణ బాణసంచాతో పోలిస్తే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే గ్రీన్ క్రాకర్స్ ఉపయోగించినప్పటికీ, ఢిల్లీ గాలి నాణ్యతలో పెద్దగా మెరుగుదల కనిపించలేదు. దీపావళి తర్వాత నగరం దట్టమైన పొగమంచు, కాలుష్యంతో కప్పుకుపోయింది.
ఢిల్లీలో కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు దీపావళి సందర్భంగా రెండు రోజుల పాటు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు అనుమతించింది. తేదీల్లో మాత్రమే ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కాల్పులకు అనుమతి ఇచ్చింది. - ధ్రువీకరించిన గ్రీన్ క్రాకర్స్ మాత్రమే ఉపయోగించాలని, బేరియం కలిగిన బాణసంచా, సంప్రదాయ బాణసంచాపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. నుంచి మళ్లీ పూర్తి నిషేధం అమల్లోకి వచ్చింది. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, నిశ్శబ్ద ప్రాంతాలకు 300 మీటర్ల పరిధిలో బాణసంచా కాల్చకూడదని కూడా ఆదేశించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గ్రీన్ క్రాకర్స్ పరిమితులు
గ్రీన్ క్రాకర్స్ సాధారణ బాణసంచాతో పోలిస్తే సుమారు 3035 శాతం తక్కువ ఉద్గారాలను విడుదల చేసేలా రూపొందించారు. అయితే ఇవి పూర్తిగా కాలుష్యరహితమైనవి కావు. వీటి నుంచి 2.5, 10 వంటి సూక్ష్మ ధూళి కణాలు విడుదలవుతాయి. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ వంటి వాయువులు వెలువడతాయి. పెద్ద సంఖ్యలో బాణసంచా కాల్చినప్పుడు కాలుష్యం గణనీయంగా పెరుగుతుంది. గాలి వేగం తక్కువగా ఉన్నప్పుడు కాలుష్య కారకాలు వాతావరణంలోనే ఉండిపోతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం గ్రీన్ క్రాకర్స్ అంటే తక్కువ కాలుష్యం మాత్రమే కానీ కాలుష్యం లేని బాణసంచా కాదు.











