కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేపట్టిన లోక్తంత్ర బచావో అరాజకత హటావో పాదయాత్రలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన, కార్యక్రమానికి ముందు అమ్మవారిని దర్శించుకున్నారు.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇండియా కూటమి ప్రచారానికి కౌంటర్‌గా బీజేపీ కార్యక్రమం
ప్రతిపక్ష ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలు, ప్రచారానికి సమాధానంగా ఈ దేశవ్యాప్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఇండియా కూటమి చేస్తున్నది తప్పుడు ప్రచారమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ ఆరోపించారు.