సందర్భంగా, 1 నవంబర్ 2026
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హర్యానా రాష్ట్ర 60వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కురుక్షేత్రకు చేరుకున్నారు. ఆదివారం అంబాలా నుంచి రోడ్డు మార్గంలో కురుక్షేత్రకు చేరుకున్న ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
హర్యానా రాష్ట్రం ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కురుక్షేత్ర యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి వజ్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ ప్రజల సుఖశాంతులు, సంతోషం, శ్రేయస్సు కోసం ఆమె ప్రార్థించారు. ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ అశీమ్ కుమార్ ఘోష్, ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు.












