యూరప్‌లో యువత చేపడుతున్న నిరసనలు జర్మనీకి కూడా విస్తరించాయి. హాలోవీన్ వేడుకల రోజున జర్మనీలోని 34 నగరాల్లో వేలాది మంది యువత వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. పెరుగుతున్న జీవన వ్యయం, విద్యారంగానికి నిధుల కొరత, తప్పనిసరి సైనిక సేవ విధానానికి వ్యతిరేకంగా వారు తమ గళం వినిపించారు.
(జెన్‌జీ బాధ్యత తీసుకుంటుంది) అనే ప్రచార సంస్థ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు మరిన్ని నిధులు కేటాయించాలని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, యువతపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని, తప్పనిసరి సైనిక సేవ విధానాన్ని రద్దు చేయాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆరోగ్య, విద్యా రంగాలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని యువత ప్రధానంగా డిమాండ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిరసనల్లో సుమారు 1.82 లక్షల మంది పాల్గొంటారని నిర్వాహకులు తొలుత అంచనా వేశారు. అయితే పోలీసుల ప్రాథమిక లెక్కల ప్రకారం బెర్లిన్, ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిచ్ నగరాల్లోనే సుమారు 6 వేల మంది పాల్గొన్నారు. నిర్వాహకుల లెక్కల ప్రకారం ఈ మూడు నగరాల్లో సుమారు 36 వేల మంది హాజరయ్యారు.












