డోల్పాలో\!
నేపాల్‌లోని హిమాలయ పర్వత ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. షే ఫోక్సుండో సరస్సును సందర్శించేందుకు వెళ్లిన ఆరుగురు భారతీయ పర్యాటకులు భారీ మంచు కురువడంతో గల్లంతయ్యారు. వీరిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. నేపాల్ సైన్యం సహాయక చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నేపాల్‌లోని డోల్పా జిల్లాలో ఉన్న షే ఫోక్సుండో సరస్సు వైపు ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఆరుగురు భారతీయ పర్యాటకులు, నుమ్లా లా, బాగ్లా లా పర్వత మార్గాల వద్ద మంచులో చిక్కుకుని గల్లంతయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ప్రభావంతో హిమాలయ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తున్నట్లు స్థానిక గైడ్లు తెలిపారు. దీంతో పర్వత మార్గాలు ప్రమాదకరంగా మారాయి.












